హాలీవుడ్ మూవీని కాపీ కొట్టిన రవితేజ కొత్త సినిమా
- August 18, 2017
మాస్ మహారాజ రవితేజ చాలా కాలం గ్యాప్ తర్వాత నటిస్తోన్న సినిమా రాజా ది గ్రేట్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అంధుడుగా రవితేజ ఈ సినిమాలో నటిస్తున్నాడు.. తనదైన స్టైల్ లో డైలాగ్స్ తో ఆకట్టుకొన్నాడు... కాగా ఈ సినిమా ట్రైలర్ ని చూసిన వారు ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అని అంటున్నారు. హాలీవుడ్ లో వచ్చిన "బ్లైండ్ ప్యూరీ" అనే సినిమాకు కాపీ.. 1989 లో రిలీజైన ఈ సినిమాలో హీరో యుద్ధం చేస్తూ తన కంటి చూపుని పోగొట్టుకొంటాడు. కంటి చూపు పోయినా తనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని సాధిస్తాడు.. రాజా ది గ్రేట్ సినిమాలో కూడా హీరో రవితేజ పుట్టుక తో అంధుడు కాదని.. పరిస్తితిల వల్ల గుడ్డివాడుగా మారతాడని టాక్ వినిపిస్తోంది. ట్రైలర్ లో తల్లి కొడుకుల మధ్య అనుబంధం తో సాగే కధగా కనిపిస్తోంది, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







