స్కిప్పింగ్ తో బరువు తగ్గడం సులభం
- August 19, 2017
రోజూ స్కిప్పింగ్ చేయడం ద్వారా బరువు తగ్గండి.. అందంగా కనిపించండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ అరగంట పాటు స్కిప్పింగ్ చేయడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చునని వారు చెప్తున్నారు.
కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం ద్వారా పొట్టపై పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగించవచ్చు. స్కిప్పింగ్ ద్వారా డైటింగ్ చేయకుండానే శరీరంలోని కొవ్వును కరిగించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
స్కిప్పింగ్ చేయడం ద్వారా బరువు తగ్గడమే కాదు.. ఊపిరితిత్తులకు మేలు చేసినవారవుతారు. స్కిప్పింగ్ చేయడంతో తరుచూ భుజాలు తిరుగుతుంటారు. దీంతో భుజాలు గుండ్రంగా తయారవుతాయి. చేతి మడమలు తిప్పుతుండటంతో వేళ్ళకు మరింతగా బలం చేకూరుతుంది.
చిన్న వయసు వారు స్కిప్పింగ్ అలవాటు చేసుకుంటే మంచిది. మెదడు విశ్రాంతిగా ఉంటుంది. స్కిప్పింగ్ చేయడం వల్ల గుండెకు మంచి వ్యాయామం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







