బెంగాలి స్టైల్ మసాలా ఫిష్ ఫ్రై
- August 19, 2017
కావాల్సిన పదార్థాలు:
కోల్‌కత బెట్కి (పండు గొప్ప) ఫిల్లెట్ - 150గ్రాములు, కసుంది మస్టర్డ్ - 50గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, పచ్చి మిర్చి (మెత్తగా నూరి)- మూడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 30గ్రాములు, కొత్తిమీర, పచ్చిమిర్చి గుజ్జు - 50గ్రాములు, బ్లాక్‌సాల్ట్ - రుచికి తగినంత, కోడిగుడ్డు - ఒకటి, ఆవనూనె - 15మిల్లీలీటర్లు, కారం - 10గ్రాములు, పసుపు - మూడు గ్రాములు, బ్రెడ్ ముక్కలు - కొన్ని.
తయారీ విధానం:
చేపను నాలుగు ముక్కలుగా కోసి శుభ్రంగా కడగాలి.
ఒక గిన్నెలో కసుంది మస్టర్డ్, ఉప్పు, కారం, పసుపు, తాజా కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి గుజ్జు వేసి కలపాలి.
చేప ముక్కలను ఈ మిశ్రమంలో వేసి ముక్కలకి ఆ గుజ్జు బాగా పట్టేలా కలిపి ఫ్రిజ్‌లో అరగంటసేపు ఉంచాలి.
మరో పాత్రలో కోడిగుడ్డు సొన వేసి బాగా గిలక్కొట్టాలి.
ఇందులో చేప ముక్కల్ని ముంచి తరువాత బ్రెడ్ ముక్కల మీద దొర్లించాలి.
వీటిని వేడి నూనెలో వేసి వేగిస్తే చేప వేపుడు రెడీ. ఈ ముక్కల్ని వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







