గచ్చిబౌలిలో 9 గంటలకు 151వ సినిమా కార్యక్రమం
- August 21, 2017
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ ఎవరు, మిగతా నటీనటులు ఎవరు అనే వివరాలు తెలుసుకోవాలని అందరూ చాల ఆత్రుతగా ఉన్నారు. అందుకే రేపు చిరు పుట్టినరోజు సందర్బంగా నటీనటుల వివరాల్ని ప్రకటించనున్నారు. రేపు ఉదయం గచ్చిబౌలిలో 9 గంటల 30 నిముషాలకు జరగబోయే కార్యక్రమంలో ఈ వివరాలను వెల్లడించనున్నారు. అంతేగాక ఈ వేడుకలోనే సినిమా లోగోను, మోషన్ పోస్టర్ ను దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ చేయించనున్నారు. ఈ వార్తతో సోషల్ మీడియాలో అభిమానులు ఇప్పటి నుండే హంగామా మొదలుపెట్టేశారు. ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనుండగా రామ్ చరణ్ నిర్మాణ భాద్యతల్ని భుజానవేసుకున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







