మామిడి పేడా
- August 23, 2017
కావలసిన పదార్థాలు: మామిడిపండ్ల గుజ్జు- 2 కప్పులు, పంచదార పొడి- 1/2 కప్పు, నెయ్యి- 3 టీ స్పూన్లు, పచ్చికోవా- 1 కప్పు, కండెన్సడ్ మిల్క్- 1 కప్పు, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, బాదం, పిస్తా తురుము- 1 టేబుల్ స్పూను.
తయారీ విధానం: ఒక నానస్టిక్ పానలో టీ స్పూను నెయ్యి వేసి వేడిచేయాలి. తరువాత కోవా, కండెన్సడ్ మిల్క్ పోసి సన్నని మంట మీద కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం ముద్దకట్టాక మంట కట్టేయాలి. తరువాత మరో నానస్టిక్ పాన తీసుకుని టీ స్పూను నెయ్యి వేసి వేడిచేయాలి. ఆ తరువాత మామిడి గుజ్జు, పంచదార, యాలకుల పొడి వేసి కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం ముద్దకట్టాక కోవా మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి. చల్లారిన తరువాత పదార్థాన్ని బాగా మెదపాలి. తరువాత చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న బిళ్ళలు చేసి మధ్యలో వేలితో ఒత్తి బాదం, పిస్తా తరుముతో అలంకరించాలి.
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







