సెల్‌ఫోన్ మైక్రోవేవ్స్‌...పిల్లలకిస్తే ఏమవుతుందో తెలుసా?

- August 23, 2017 , by Maagulf
సెల్‌ఫోన్ మైక్రోవేవ్స్‌...పిల్లలకిస్తే ఏమవుతుందో తెలుసా?

సెల్‌ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని.. సాధ్యమైనంతవరకు సెల్‌ఫోన్‌లో క్లుప్తంగా మాట్లాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునికత పెరిగే కొద్దీ సాంకేతిక పరికరాల వినియోగం అమాంతం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కంప్యూటర్లు,  సెల్ ఫోన్లు లేని ప్రపంచాన్ని ఊహించలేం. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ సెల్ ఫోన్ తప్పనిసరి అయ్యింది. 
 కానీ సెల్ ఫోన్ల ద్వారా మైక్రోవేవ్స్ అనే సూక్ష్మతరంగాలు అతి సులభంగా శరీరంలోకి చొచ్చుకుపోగలుగుతాయి. ఇలా శరీరంలో నుంచి ప్రయాణించే మైక్రోవేవ్స్ ద్వారా శరీరకణాల్లో కొన్ని అవాంఛనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని.. అవి భవిష్యత్తులో మనకు ప్రమాదకరంగా పరిణమిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్ తరంగాలు పెద్దవారి మెదడు కంటే పిల్లల మెదడుపై మూడురెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. 
 అందుకే సెల్ ఫోన్ వినియోగాన్ని పిల్లలు బాగా తగ్గించాలి. గేమ్స్ కోసం ఫోన్లను అలవాటు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా మనలో ఎడమభాగపు మెదడు కన్నా కుడిభాగపు మెదడు సున్నితంగా ఉంటుంది. అందుకని సెల్‌లో మాట్లాడేటప్పుడు ఎడమ చెవినే ఎక్కువగా ఉపయోగించడం మంచిది. సెల్‌ఫోన్‌ ఎంత చిన్నగా ఉంటే తరంగాల వల్ల కలిగే దుష్ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది.
 అందుకే పిల్లలు పెద్దలు కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లన పరిమితంగా ఉపయోగించాలి. ఆహారం తీసుకునేటప్పుడు పిల్లలకు గేమ్స్ చూస్తూ తినిపించకూడదు. కుటుంబసభ్యులతో కలిసి ఆహారం ఇవ్వడం అలవాటు చేయాలి. స్మార్ట్ ఫోన్లను పడకగదిలో ఉంచకండి. రోజుకు రెండు గంటల వరకే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లను పిల్లలు ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com