ఇమ్యూనిటి బూస్టింగ్ ఫుడ్స్ వైరల్ ఫీవర్ కొరకు
- October 25, 2015
వాతావరణంలో మార్పులతో పాటు, మన శరీరాల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. వాతావరణంను బట్టి మన శరీరం కూడా మార్పులతో పాటు ఆరోగ్యంగా ఉండాలి. సీజనల్ మార్పుల వల్ల మన శరీరంలో వ్యాధినిరోధక శక్తి క్రమంగా తగ్గుతుంది. ముఖ్యంగా వాతావరణం కొద్దిగా చల్లబడిందంటే చాలు వైరల్ ఫీవర్ మరియు కామన్ కోల్డ్ వంటి ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. అంతే కాదు, ఇవి ఇతరుకలు కూడా చాలా తేలికగా..సులభంగా వ్యాపింపచేస్తాయి . అలాంటి పరిస్థితిలో ఇమ్యూనిటి బూస్టింగ్ ఫుడ్స్(వ్యాధినిరోధకతను)పెంచే ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం. అయితే మనంలో చాలా మందికి ఈ ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ తినే ఓపిక కూడా కలిగి ఉండరు. అందువల్ల, మరి వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవడం ఎలా? ఆరోగ్యం కోసం ఒక 5నిముషాలు వెచ్చించి స్వతహాగా ఇమ్యూన్ బూస్టర్స్ ను మీరే హెల్తీగా తయారుచేసుకోండి...సింపుల్ జ్యూసులు వ్యాధినిరోధకతను పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. మరి వీటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకోవాలి. : వైరల్ ఫీవర్ బాధ నుండి ఉపశమనం కలిగించే ఆహారాలు వీటిని రెండు మూడు రోజుల పాటు రోజుకు రెండు సార్లు తీసుకోవాలి . వీటిని తీసుకోవడం వల్ల మైనర్ ఇన్ఫెక్షన్స్ నుండి శరీరంను కాపాడుకోవచ్చు. (నోట్ : మీరు ఇదివరకే ఫీవర్ లేదా ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రధించండి.హోం రెమెడీస్ కేవలం నివారణులుగా మాత్రమే సహాయపడుతాయి) బీటాకెరోటిన్, యాంటీయాక్సిడెంట్స్ మరియు విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న క్యారెట్స్ వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి . ఈ ఇమ్యూనిటి బూస్టింగ్ జ్యూస్ ను తయారుచేయడానికి ముందుగా 4 క్యారెట్స్ ను సిద్దంగా ఉంచుకోండి.. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి, ఇది ఇమ్యూనక్ బూస్టింగ్ ఫుడ్. మరియు సిట్రిక్ యాసిడ్ శరీరంలోని పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. మరి 3 నిమ్మకాయలను సిద్దం చేసుకోవాలి. అల్లం:ఇమ్యూన్ బూస్టింగ్ జ్యూస్ కు అల్లం కూడా జోడించడాలి. ఎందుకంటే?అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల ఇది మొత్తం శరీరం యొక్క నొప్పేలను నివారించడానికి, వికారంను నయం చేయడానికి సహాయపడుతుంది కాబట్టి, కొద్దిగా అల్లం చేర్చడం మంచిది. వెల్లుల్లి: వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో వెల్లుల్లి బాగా సహాయపడుతుంది. ఎందుకంటే వెల్లుల్లిలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . వెల్లుల్లి లేకుండా ఇమ్యూన్ బూస్టింగ్ జ్యూస్ తయారవ్వదు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 4 క్యారెట్లను కట్ చేసే వేయాలి. అలాగే నిమ్మరసం పిండాలి, కొద్దిగా అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక చెంచా పసుపు మరియు 2 చుక్కల తేనె వేసి గ్రైండ్ చేయాలి. నీళ్ళ సరిపడా పోసి, బ్లెడ్ చేసి, సగం ఉదయం మరియు మరో సగం సాయంత్రంలో త్రాగితే ఇమ్యూనిటి పెరుగుతుంది. నిద్ర సరిపడా నిద్రపోవడం వల్ల శరీరం మరియు మనస్సుకు తగినంత విశ్రాంతి అందుతుంది. దాంతో త్వరగా కోలుకుంటారు. నిద్రలేమి వ్యాధినిరోధక శక్తిని తగ్గించేస్తుంది. మీలో ఇమ్యూనిటీ లెవల్స్ నార్మల్ స్థితికి చేరుకొనే వరకూ ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. వ్యాధినిరోధక శక్తి మరింత లోపంపచేసే స్మోకింగ్ ను వెంటనే మానేయడం మంచిది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







