భారతీయ యువ ఇంజినీర్ కు బ్రిటన్ రాణి ఆహ్వానం
- October 25, 2015
భారతీయ సంతతి యువ ఇంజినీర్ యువతికి ఊహించని ఆహ్వానం అందింది. తన ప్యాలెస్ కు ఓసారి వచ్చి పోవాలంటూ ఏకంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 రోమా అగర్వాల్(29) కు ఆహ్వానం పలికింది. లండన్ లోని షార్ద్ అనే ప్రాంతంలో యూరప్ లోనే అత్యంత ఎత్తయిన భవన నిర్మాణంలో ఇంజినీర్ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ సందర్భంగా వారికోసం ఏర్పాటుచేసిన విందు కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఎలిజబెత్ ప్రత్యేక ఆహ్వానం పలికారు. దీంతో ఆమె తన సహచర ఇంజినీర్లతో కలిసి అత్యంత విలాసవంతమైన బ్రిటన్ ప్యాలెస్ లోకి అడుగు పెట్టనుంది. ఈ సందర్భంగా ఎంఎస్ అగర్వాల్ స్పందిస్తూ మహిళా ఇంజినీర్లపై ఎంతో కాలంగా ఉన్న ఛాందసమైన ఆలోచన తప్పని, యువతులు దీనిని ఆహ్లాదభరితంగా తీసుకొని కెరీర్ మలుచుకొని ఇంజినీర్లుగా రాణించాలని సూచించారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







