ఒమాన్ షేక్ అడ్డం తిరిగాడు
- August 27, 2017
హైదరాబాద్: బాలికను ఒమాన్ కు చెందిన వృద్ధ షేక్ వివాహం చేసుకున్న వివాదం సరికొత్త మలుపు తిరిగింది. మూడు నెలల క్రితం పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకొని ఒమాన్ లో చిత్రహింసలు అనుభవిస్తున్న పదహారేళ్ల రౌక్సర్ ఇంకా వృద్ధషేక్ చెరలోనే ఉంది. ఆమె ఫోన్‌లో వినిపించిన సంభాషణలు, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఫలక్‌నుమా పోలీసులు అహ్మద్‌పై ఇటీవల కేసు నమోదు చేశారు. రౌక్సర్‌ను పంపిచాలంటే తాను బ్రోకర్లకు ఇచ్చిన రూ.5 లక్షల నగదుతోపాటు ఖర్చులు తన ఖాతాలో వేయాలంటూ అహ్మద్ షరతులు విధిస్తున్నాడు. పైగా తాను ఇస్లాం మత పద్ధతుల్లోనే బాలికను వివాహం చేసుకున్నానని పోలీసులనే దబాయిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులకు ఒక వీడియోను పంపించాడు. పోలీసులు మాత్రం రౌక్సర్‌ను సురక్షితంగా పంపకపోతే తామే అక్కడికి వస్తామంటూ అతడిని హెచ్చరించారు. రెండు రోజులు వేచి చూశాక అహ్మద్ నుంచి స్పందన రాని పక్షంలో ఒమాన్ కు ప్రత్యేక బృందాన్ని పంపుతామని దక్షిణమండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు.
సక్రమంగానే పెళ్లి చేసుకున్నా.. పదహారేళ్ల రౌక్సర్‌ను ఆమె తండ్రి అఫ్సర్ అంగీకారంతో తాను సక్రమ పద్ధతుల్లోనే పెళ్లి చేసుకున్నానంటూ ఒమాన్ షేక్ వీడియో సాక్ష్యాలను పంపించాడు. ఆ వీడియోలో బ్రోకర్లు గౌసియా బేగం, సికిందర్ చెప్పిన మాటలు, ఎలాగైనా రౌక్సర్‌తో వివాహం జరిపిస్తాం. మాకు రూ.5 లక్షలు ఇవ్వండి.. కట్నంగా ఒక స్కూటీ, ఇతర వస్తువులు మాత్రం అఫ్సర్‌కు ఇస్తేచాలు అన్నమాటలు, మంతనాలూ అందులో ఉన్నాయి. రౌక్సర్‌ను పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులొస్తాయన్న భావనతో రౌక్సర్ వయస్సును 21 సంవత్సరాలుగా రాయించి తీసుకురావాలంటూ గౌసియాబేగంకు వివాహం జరిపించే ఖాజీ సూచించాడు. ఖాజీ సూచనను గౌసియాబేగం రౌక్సర్ తండ్రి అఫ్సర్‌కు తెలపగా.. రౌక్సర్ వయస్సు 21 సంవత్సరాలంటూ ధ్రువీకరణ పత్రం తెచ్చాడు. ఈ పత్రాన్ని ఒమన్ షేక్‌కు చూపించగా.. వారికి రూ.5లక్షలు ఇచ్చిన అనంతరం ఖాజీ ఇద్దరికీ పెళ్లి చేశాడు. నాలుగురోజులు హైదరాబాద్‌లో ఉన్న అనంతరం అహ్మద్ రౌక్సర్‌కు పాస్‌పోర్టు తీయించి పెళ్లిఫోటోలను తన పాస్‌పోర్టుకు జతచేసి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన రౌక్సర్ అతడికి ముందే పెళ్లయ్యిందంటూ తెలుసుకుంది. తల్లిదండ్రులతో మాట్లాడతానంటూ అప్పుడప్పుడు అతడి ఎదురుగానే మాట్లాడేది. ఎవరూ లేని సమయంలో ఫోన్‌చేసి తనను చిత్రహింసలు పెడుతున్నారంటూ రోదిస్తూ తల్లిదండ్రులకు వివరించింది.
ఒమాన్ షేక్ అహ్మద్‌ను అరెస్ట్ చేసేందుకు ఫలక్‌నుమా పోలీసులు సాక్ష్యాలను సిద్ధం చేసుకున్నారు. రౌక్సర్ తండ్రి అఫ్సర్ వాంగ్మూలం సేకరించారు. భారత చట్టాల ప్రకారం బాల్యవివాహం నేరమని, మైనర్‌ను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటే భారత శిక్షాస్మృతి ప్రకారం శిక్ష అనుభవించాలంటూ అహ్మద్‌కు ఫోన్ చేసి చెప్పారు. విదేశీయులు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు అంగీకరించినా సరే అమ్మాయి యుక్త వయస్సు కాకపోతే పెళ్లి కూడా చెల్లదంటూ పేర్కొంటూ ఇందుకు సంబంధించిన పాతకేసుల వివరాలు, న్యాయస్థానాలు వెల్లడించిన తీర్పులను ఇందుకు సాక్ష్యాధారాలుగా తయారు చేసుకున్నారు. ఒమాన్ కు నుంచి బాలికను తీసుకొచ్చాక మెజిస్ట్రేట్ సమక్షంలో రౌక్సర్ వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అతడికి పోలీసులు ఇప్పటికే వివరించారు. దీంతోపాటు అతడిపై కేసు నమోదు చేసిన అనంతరం న్యాయస్థాయంలో బలమైన సాక్ష్యాధారాలుండేలా ఆమె తల్లిదండ్రులతో పాటు బ్రోకర్‌లను అప్రూవర్‌లుగా మార్చారు. దీంతోపాటు ఒమాన్ షేక్ బసచేసిన లాడ్జి, అతడు పెళ్లి సమయంలో అతడి తరఫున ఉన్న సాక్షులు ఎవరు అన్న అంశాలను ఫోటోలు, వీడియోలో తీశారు. బాల్యవివాహం చేసుకోవడంతో పాటు పోలీసులకే పాఠాలు చెబుతున్నారంటూ పోలీస్ అధికారులు ఒమాన్ షేక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి చేసిన బ్రోకర్లను తమదైన శైలిలో ‘కౌన్సిలింగ్’ ఇచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







