ఆధార్ వ్యవస్థ సురక్షితమే
- August 27, 2017
న్యూదిల్లీ: ఆధార్ వ్యవస్థ సురక్షితంగా ఉందని.. ఎటువంటి లీకులకు అవకాశం లేదని ది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథార్టీ ఆఫ్ ఇండియా భరోసానిచ్చింది. ఇటీవల కొన్ని విదేశీ సంస్థల చేతిలోకి ఆధార్ సమాచారం వెళ్లిందని వస్తున్న వార్తలను యూఐడీఏఐ కొట్టిపారేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్‌కు సంబంధించిన బయోమెట్రిక్ సాంకేతికత దేశీయంగా అభివృద్ధి చేసిందని పేర్కొంది. స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది ఇటువంటి తప్పుడు ప్రచారాలను చేపడుతున్నారని తెలిపారు. ఆధార్ కోసం వినియోగించే ప్రతి యంత్రాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాతే బయోమెట్రిక్ సమాచారం సేకరించడానికి వినియోగిస్తామని అన్నారు.
ఆధార్ డేటాబేస్‌లోకి అమెరికా నిఘాసంస్థ సీఐఏ చొరబడిందని వికీలీక్స్ పేర్కొనడంతో కలకలం రేగింది. దీంతో యూఐడీఏఐ స్పందించి వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







