హీరోయిన్ ఛార్మీ బయటపెట్టిన బాలకృష్ణ సీక్రెట్
- August 27, 2017
బాలకృష్ణ అభిమానులు తమ హీరోను బాలయ్యబాబు నందమూరి సింహం అన్న పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే బాలకృష్ణకు తన అభిమానులు తనను ముద్దుగా పిలిచే ఆ ముద్దుపేరు నచ్చవట. బాలకృష్ణ ఎంతగానో ఇష్టపడే మరొక ముద్దుపేరుకు సంబంధించిన సీక్రెట్ ను బయట పెట్టింది ఛార్మీ.
నిన్న జరిగిన 'పైసా వసూల్' ఆడియో సక్సస్ మీట్ లో ఛార్మీ ఈ కామెంట్స్ చేసింది. ఈ విషయాన్ని లీక్ చేస్తూ ఛార్మీ తెగ వయ్యారాలు పోతూ పదే పదే మైక్ ముందు చేసిన ఓవర్ యాక్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది. బాలకృష్ణకు తన హీరోయిన్స్ చేత 'బాల' అని పిలిపించుకోవడం ఇష్టమట.
ఈ విషయాన్ని చార్మి అలా చెబుతుంటే బాలయ్య బాబు తెగ ఆనందపడిపోతు మధ్యలో చార్మిని దగ్గరకు తీసుకుని అభినందించిన సీన్స్ చూసి ఆ ఆడియో సక్సస్ మీట్ కు వచ్చిన చాలామంది ఆశ్చర్యపోయినట్లు టాక్. బాలకృష్ణ తాతగా మారిపోయినా ఇంకా బాలయ్యలోని ఆ చిలిపి కృష్ణుడు ఇంకా హడావిడి చేస్తూనే ఉన్నాడు అంటూ కొందరు సెటైర్లు వేసుకున్నట్లు టాక్.
ఇది ఇలా ఉండగా ఈవారం విడుదల కాబోతున్న ఈమూవీకి ఇవాల్టి నుంచి భారీ పబ్లిసిటీ ఇచ్చి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ తీసుకురావడానికి పూరి జగన్నాథ్ మాష్టర్ ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం 'అర్జున్ రెడ్డి' మ్యానియాలో కొట్టుకుపోతున్న ప్రస్తుతతరం యూత్ ఈ 'బాల' చిలిపి పనుల గురించి ఎంతవరకు కనెక్ట్ అవుతారో చూడాలి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







