ప్లాప్‌లు వచ్చినా ఆగని అవకాశాలు
- August 29, 2017
హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలకు దర్శకత్వం వహించ్ ఛాన్స్ కొంత మందికి మాత్రమే వస్తుంది. అలా హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకొంటున్నాడు బాబీ.. పవర్ సినిమాతో రచయిత నుంచి దర్శకుడిగా మారిన బాబీ పవన్ కల్యాణ్ తో సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ తీశాడు.. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని జైలవకుశలో మూడు పాత్రల్లో చూపించబోతున్నాడు. బాబి దర్శకత్వంలో వచ్చిన పవర్ యావరేజ్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత తీసిన సర్ధార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అయ్యింది. అయనప్పటికీ బాబి చెప్పిన కథ నచ్చి, ఎన్టీఆర్ చాన్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్ ని తొలి సారి మూడు పాత్రల్లో చూపించబోతున్న జైలవకుశపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీ దసరా బరిలో దిగుతోంది. కాగా ఈ సినిమా రిలీజ్ కాకుండానే బాబీ మళ్ళీ మెగా క్యాంప్ లో అడుగు పెడుతున్నాడు.. జైలవకుశ కంప్లీట్ అయ్యాక, బాబికి ఓ మెగా హీరోని డైరెక్ట్ చేసే చాన్స్ వచ్చింది. ఆ మెగా హీరో అల్లు అర్జున్. బన్నీ ప్రజెంట్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ షూటింగ్ తో బిజిగీ ఉన్నాడు. ఆ తర్వాత లింగుస్వామితో బైలింగ్వల్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత బాబి దర్శకత్వంలో చేయడానికి బన్నీ రెడీ అవుతున్నాడట. జైలవకుశ రిజల్ట్ తెలియకముందే మెగా క్యాంప్ నుంచి ఆఫర్ అందుకోబోతున్నాడు బాబి. దీంతో టాలీవుడ్ లో లక్కీ డైరెక్టర్ బాబీ అని టాక్.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







