వరల్డ్ నంబర్ వన్ కావడమే లక్ష్యం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
- August 29, 2017
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన తెలుగుతేజం పీవీ సింధు నగరానికి తిరిగి వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమెకు అభిమానులు, తెలంగాణా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధికారులు ఘనస్వాగతం పలికారు. కోచ్ , తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను మూడోసారి వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్ గెలిచానని సింధు వ్యాఖ్యానించింది. స్వర్ణం చేజారడం నిరాశ కలిగించినా... మూడోసారి తన మెడల్ కలర్ మార్చుకుంటానన్న మాట నిలుపుకున్నానని చెప్పింది. అటు సింధు ఆటతీరుపై కోచ్ గోపీచంద్ ప్రశంసలు కురిపించారు. ఫైనల్లో అద్భుతంగా పోరాడిందని, ఫిట్నెస్ లెవెల్స్ మరింత మెరుగైతే తనకు తిరుగుండదని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







