అమెరికా హెచ్చరికలు టెక్సాస్ నగరాన్ని ఖాళీ చెయ్యాలంటూ...
- September 01, 2017
టెక్సాస్ నగరాన్ని తక్షణం ఖాళీ చేయకుంటే అక్కడ నివశించేవారు చనిపోతారని అమెరికా హెచ్చరించింది. ప్రస్తుతం అమెరికాను హార్వే హరికేన్ అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో తూర్పు టెక్సాస్ వాసులకు ప్రభుత్వ అధికారులు "వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోండి.. లేకపోతే చచ్చిపోతారు" అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
గతవారం రోజులుగా తూర్పు టెక్సాస్‌పై హార్వే హరికేన్ విరుచుకుపడి, కకావికలం చేస్తున్న విషయం తెల్సిందే. వారంరోజుల్లో 132 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే వరుణుడు ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. దీంతో హూస్టన్ నగరం సముద్రాన్ని తలపిస్తోంది. రిజర్వాయర్లలో నీటిమట్టం 82 అడుగులకు చేరింది.
టేలర్ కౌంటీలోని నిషెస్, స్టీన్ హేగెన్ రిజర్వాయర్ల గేట్లు ఎత్తేయాల్సిందిగా ఆర్మీ ఆదేశించింది. ఈ గేట్లు ఎత్తేస్తే ఆ నీరు ఊళ్లను ముంచెత్తనుంది. దీంతో తక్షణం ఆ ఊళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. లేనిపక్షంలో ఆ ప్రాంత వాసులు ప్రాణాలతో ఉండే అవకాశాలు చాలా తక్కువని స్పష్టం చేశారు.
అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన విపత్తు అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వెయ్యేళ్లకోసారి ఇలాంటి వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా, ఇప్పటివరకు టెక్సాస్‌లో 12 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిగా, 48,700 ఇళ్లు ధ్వంసమయ్యాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







