కేబుల్ దొంగతనం: ఆరుగురి అరెస్ట్
- September 01, 2017
దుబాయ్, అలాగే ఇతర ఎమిరేట్స్‌లోని వేర్‌హౌస్‌లనుంచి కేబుల్స్‌ని దొంగలిస్తున్న ఆరుగుర్ని దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఆసియాకి చెందినవారిగా గుర్తించారు. ఓ వేర్‌హౌస్‌లో దొంగతనానికి యత్నిస్తుండగా వీరిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు దుబాయ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎఫైర్స్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీమ్ అల్ మన్సౌరి చెప్పారు. వరుసగా జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో తమకు అందిన ఫిర్యాదుల మేరకు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినట్లు ఆయన వివరించారు. విచారణ సందర్భంగా ఎలక్ట్రిక్ కేబుల్స్‌ని ఒకే పద్ధతిలో నిందితులు దొంగిలిస్తున్నట్లు గుర్తించామన్నారు ఆయన. అరెస్ట్ చేసిన నిందితుల్ని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







