తన ఔనత్యాన్ని చాటుకున్న గౌతమ్ గంభీర్
- September 05, 2017
టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ మరోసారి తన ఔనత్యాన్ని చాటుకున్నారు. మైదానంలో ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో, వ్యక్తిగా తాను చేసే పనుల్లో ఎప్పుడూ ఓ మెట్టు ఎదుగుతుంటారు గంభీర్. తాజాగా ఆయన ప్రకటించిన ఓ నిర్ణయమే ఇందుకు కారణం. ఉగ్రదాడిలో మృతిచెందిన అధికారి అబ్దుల్ రషీద్. తండ్రి కోసం ఏడుస్తున్న కూతురు జోహ్రా ఫొటోపై స్పందిస్తూ మనస్సుకు హత్తుకునే పోస్ట్ చేశారు గంభీర్.
'జోహ్రా, జోలపాట పాడి నేను నిన్ను నిద్రపుచ్చలేను. కానీ నువ్వు నీ జీవిత లక్ష్యాలను సాధించుకునేందుకు మాత్రం చేతనైన సాయం చేయగలను. నీ చదువు బాధ్యతలను జీవితాంతం చూసుకుంటానని' గంభీర్ ఓ ట్వీట్లో రాసుకొచ్చారు. 'నీ కన్నీటి బొట్టును నేలకు రాలనివ్వకు. నీ కన్నీటిబొట్టు తాకగానే భూమాత గుండె బరువెక్కుతోంది. ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన నీ తండ్రి అబ్దుల్ రషీద్‌కు ఇదే నా సెల్యూట్' అంటూ అందరిని కదిలించే విధంగా ట్విట్ చేశారు గంభీర్.
గత ఆగస్ట్‌లో జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఏఎస్ఐ అబ్దుల్ రషీద్ మృతిచెందిన విషయం తెలిసిందే. గత ఏప్రిల్‌లో ఐపీఎల్ లో తన జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ ద్వారా అందుకున్న పారితోషికాన్ని సుక్మా ఉగ్రదాడిలో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అందజేసిన విషయం తెలిసిందే.
థ్యాంక్యూ గౌతమ్ సార్
తనకు సాయం చేస్తానని చెప్పిన క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు జవాను కూతురు జోహ్రా థన్యవాదాలు తెలిపింది. 'మీ ప్రకటనపై నాతో పాటు మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. డాక్టర్ కావాలన్నదే నా ధ్యేయమని' జోహ్రా చెప్పింది.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







