పొట్లకాయ పనీర్ గుత్తి కూర
- September 06, 2017
కావలసిన పదార్థాలు: పొట్లకాయ - 1, పనీర్ గుజ్జు - తగినంత, ఉప్పు - కొద్దిగా, నూనె - రెండు టేబుల్ స్పూన్లు.
పనీర్ గుజ్జు కోసం: పనీర్ తురుము - 2 కప్పులు, ఉల్లి, క్యాప్సికం తరుగు - అరకప్పు చొప్పున, టమోటో గుజ్జు - 1 కప్పు, కారం - 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్ స్పూను, గరం మసాలా - అర టీ స్పూను, ఎండు మెంతి - చిటికెడు, జీలకర్ర - 1 టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత. తయారీ: నూనెలో జీలకర్ర వేగాక ఉల్లి, క్యాప్సికం తరుగు, అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, మెంతి, టమోటో గుజ్జు వేగించి పనీర్, ఉప్పు కలిపి కొత్తిమీర చల్లి దించేయాలి.
గుత్తికూర తయారుచేసే విధానం: పొట్లకాయని రెండు అంగుళాల గుండ్రని ముక్కలుగా కట్ చేసి, గింజలు తీసేసి ఉప్పు కలిపిన నూనెను వేలితో లోపలి భాగంలో రాసి, ఓవెన్‌లో మూడొంతులు ఉడికేలా పెట్టి తీసి చల్లారనివ్వాలి. తర్వాత పనీర్ గుజ్జును కూరి పెనంపై నూనె రాసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. రొట్టెలతో తిన్నా, అన్నంతో నంజుకున్నా బాగుండే వంటకం.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







