శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్

- September 06, 2017 , by Maagulf
శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్

శ్రీలంక పర్యటనలో టీం ఇండియా విజయపరంపర కొనసాగింది. టెస్ట్‌, వన్డే, ఏకైక టీ-20 మూడింటిని క్లీన్‌ స్వీప్‌ చేసి క్రికెట్‌ హిస్టరీలో టీం ఇండియా సరికొత్త రికార్డు సృష్టించింది. బుధవారం జరగిన ఏకైక టీ-20 మ్యాచ్‌లో కోహ్లీ సేన విజయ దుందుబి మోగించింది. కోహ్లీ 82(54) కెప్టెన్‌ ఇన్నింగ్స్కు తోడు మనీశ్‌ పాండే 51(36) మెరుపులు తోడవ్వడంతో  7 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది.

టాస్‌ గెలిచిన కోహ్లీ శ్రీలంకను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 170 పరుగులు చేసింది. శ్రీలంక ఆటగాళ్లలో దిల్షాన్‌ మునవీర 53(29), అషాన్‌ ప్రియంజన్‌ 40(40) రాణించారు. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోర్లకే ఔటైనా శ్రీలంక పరుగుల వరద పారించింది. బ్యాట్స్‌మన్‌ దిల్షాన్‌ మునవీర 53(29)  హాఫ్‌ సెంచరీ చేశాడు. ఓ ఎండ్‌లో వికెట్టు పడుతున్న మునవీర మాత్రం బౌలర్లను ఆటాడుకున్నాడు. 99 పరుగుల వద్ద మునవీరను కుల్దీప్‌ యాదవ్‌ బోల్తా కొట్టించడంతో రన్‌ రేట్‌ పడిపోయింది.

ధోని మరోసారి అద్భుత స్టంపింగ్‌ చేశాడు. ఏంజెలో మాథ్యూస్‌ (7)ను మిల్లీమీటర్‌ తేడాతో స్టంపింగ్‌ చేసి అబ్బురపరిచాడు. 113 పరుగుల వద్ద పెరీరా (11), శనక (0)ను చాహల్‌ ఔట్‌ చేయడంతో మ్యాచ్‌ భారత్‌ చేతిలోకి వచ్చినా అషాన్‌ ప్రియంజన్‌ (40)  రెండు సిక్సర్లు బాది మెరవడంతో శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భారత బౌలర్లు చాహాల్‌కు 3వికెట్లు దక్కగా కులదీప్‌ యాద్‌వ్‌కు 2, భువనేశ్వర్‌, బుమ్రాలు చెరో వికెట్‌ తీశారు.
 
లక్ష్యఛేదనలో భారత్‌ ఆరంభంలోనే ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 9(8) వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ, రాహుల్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే రాహుల్‌(24) ప్రసన్న బౌలింగ్‌లో శంకరకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తరువాత వచ్చిన పాండేతో కోహ్లీ జత కలిసి మెరుపులు మెరిపించారు. శ్రీలంక బౌలర్లలో ప్రసన్న, మలింగా, ఉదానలు చెరో వికెట్‌ తీశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com