అల్లు శిరీష్ సినిమాలో దాసరి అరుణ్ కుమార్ విలన్ గా
- September 08, 2017
అల్లు శిరీష్ కథానాయకుడిగా దర్శకుడు వి.ఐ. ఆనంద్ తెరకెక్కించే సినిమాలో దాసరి నారాయణరావు తనయుడు అరుణ్ కుమార్ విలన్‌గా కనిపిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్. చాలాకాలం క్రితం హీరోగా అరంగేట్రం చేసినా.. కథానాయకుడిగా అతనికి మంచి సక్సెస్ రాలేదు. దీంతో కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. అవి కూడా పెద్దగా గుర్తింపు తీసుకురాకపోవడంతో సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చాడు.
తాజాగా విలన్ రోల్ చేసేందుకు ముందుకొచ్చాడు. ఈ పాత్ర ద్వారా తనకు గుర్తింపు లభిస్తుందని అరుణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనుంది. ఎక్కడికి పోతావు చిన్నదానా ఫేమ్ వీఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అల్లు శిరీష్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







