సుమారుగా రెండేళ్లలో 11 మందిని పెళ్లి చేసుకున్న థాయ్ భామ
- September 09, 2017
రెండేళ్లలో 11 మందిని పెళ్లి చేసుకుంది. వారినుంచి కట్నం కూడా తీసుకుంది. థాయ్ సంప్రదాయం ప్రకారం అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలకు ఎదురు కట్నం ఇవ్వాలి. అదే సంప్రదాయాన్ని పాటించింది ఈ అందాల భామ. అందంతో ఆకర్షించి ఎదుటి వాటిని బుట్టలో పడేయడమే కాకుండా పెళ్లి అనే ముడితో బంధించి కట్నం రాబట్టేది. రెండేళ్లుగా కొనసాగిస్తున్న ఈ తంతుకి పోలీసులు ముగింపు పలికారు. గుట్టు రట్టయింది. భామ కటకటాల పాలైంది. ఆమె పేరు జరియాపోర్న్ బుయాయి. నచ్చిన యువకులతో పరిచయాలు పెంచుకుని వారిని బుట్టలో పడేసేది. తన మీద బాగా నమ్మకం కలిగించి పెళ్లి చేసుకోమనేది. థాయ్ సంప్రదాయం ప్రకారం ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవారు. అలా ఈ రెండేళ్లలో 11 మందిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. ఆగస్టు నెలలోనే నలుగుర్ని పెళ్లాడిందట. ఇటీవల ఆమె గురించి ఫేస్బుక్లో 'రన్నింగ్ బ్రైడ్' అంటూ ఓ పోస్ట్ కూడా వచ్చింది. ఫేస్బుక్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే తానెవర్నీ మోసం చేయలేదంటోంది ఈ థాయ్ అమ్మడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







