మహేశ్ స్పైడర్ ట్రైలర్ రిలీజ్ అయినది
- September 14, 2017
టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన ప్రిన్స్ మహేశ్ బాబు మరుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్పైడర్ ట్రైలర్ కొద్ది గంటల క్రితం విడుదలైంది. భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి సమయంలో విడుదలైన ఈ ట్రైలర్ 1మిలియన్ వ్యూస్ దిశగా దూసుకుపోతోంది. ఇవాళ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో స్పైడర్ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరగనుంది. అందరూ ఈరోజు సాయంత్రం ట్రైలర్ విడుదలవుతుందని భావించారు. కానీ, స్పైడర్ ట్రైలర్ అనుకున్న సమయం కంటే ముందే విడుదల కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఈ ట్రైలర్ నా పేరు శివ అంటూ మహేశ్ బాబు చెప్పే వాయిస్ ఓవర్‌తో మొదలై ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఒక నిమిషం 52సెకన్ల నిడివిలో స్పైడర్ టీజర్ కనువిందు చేసింది. టీజర్‌లో, సాంగ్స్ ప్రోమోల్లో ఉన్న కొన్ని సీన్లు ట్రైలర్‌లో కూడా రిపీట్ కావడంతో ఫ్యాన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్‌ను గమనిస్తే యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని స్పష్టమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో టీజర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాకు సంబంధించి మరో క్యాచీ సాంగ్‌ను స్పైడర్ బోనస్ ట్రాక్ పేరుతో నెట్‌లో పెట్టారు. గీతామాధురి పాడిన ఈ పాట ఆకట్టుకునే విధంగా ఉంది. స్పైడర్ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







