తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మ 20న ప్రారంభం
- September 14, 2017
తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మను ఈ నెల 20న ప్రారంభించి 28వ తేదీన దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మను జరుపుకోవాలని కాజీపేట శ్వేతార్కాలయం, శ్రీ భద్రకాళి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి, తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతుల కోర్ కమిటీ సభ్యుడు ఐనవోలు అనంతమల్లయ్యశర్మ సిద్ధాంతి తెలిపారు. కాజీపేట విష్ణుపురిలోని స్వయం భూ శ్వేతార్క మూలగణపతి దేవాలయ దివ్యక్షేత్రం లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన అమవాస్య తిథి ఉదయం 10.13 గంటల వరకు ఉన్నందున పెద్దలకు ఇదే రోజున బియ్యం ఇచ్చుకోవాలని సూచించారు. 19వ తేదీన అపరాహ్నకాలంలో పితృతర్పణములు ఇచ్చుకొనుట, విప్రులు మహాలయ అమవాస్య జరుపుకోవాలని తెలిపారు.
అమవాస్య తిథి సూర్యోదయంలో ఉన్నందున 20వ తేదీన బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ నెల 21వ తేదీన శరన్నవరాత్రోత్సవ కలశ స్థాపనాది పూజలను ఆరంభించాలని, 24వ తేదీన లలితా పంచమి కావడంతో ఉపాంగ లలితాదేవి వ్రతాన్ని ఆచరించాలని సూచించారు. 27న త్రిరాత్ర కలశ స్థాపన, 28న సరస్వతీ పూజ, దుర్గాష్టమి పండుగలను, 29న మహానవమి, హోమబలిదానములు, 30వ తేదీన విజయదశమి దసరా పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







