సరైన నాణ్యత లేని మొబైల్ ఛార్జర్లతో ప్రమాదమని వినియోగదారులకు హెచ్చరిక

- September 14, 2017 , by Maagulf
సరైన నాణ్యత లేని మొబైల్ ఛార్జర్లతో ప్రమాదమని వినియోగదారులకు  హెచ్చరిక

రియాద్ : ఇటీవల కాలంలో మొబైల్ ఛార్జర్లు మొక్కజొన్న పేలాల మాదిరిగా టప టపామని పేలిపోవడం గమనిస్తున్నాం. తక్కువ-నాణ్యత గల మొబైల్ ఫోన్ ఛార్జర్ల కొనుగోలుకు వ్యతిరేకంగా ఒక నిపుణుడు సాధారణ ప్రజలను హెచ్చరించారు. చెడు నాణ్యత గల ఛార్జర్లు నుండి వెలువడే విద్యుదీకరణ మరియు మంటలు పలు నష్టాలకు  విపత్తులకు ప్రధాన కారణమయ్యే అవకాశం ఉంది కనుక వాటిని కొనరాదు. అన్ని ఖర్చులు భరించే సాధారణ  వినియోగదారులు నకిలీ చార్జర్లు కొనుగోలు విషయంలో దారుణంగా మోసపోతున్నారు. నకిలీ చార్జర్ల కారణంగా అనేక దుర్ఘటనలకు దారితీశాయిని కింగ్ సాడ్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్  అబ్దుల్లా అల్-షాలాన్ తెలిపారు.కొన్నాళ్ళు క్రితం ఒక సెల్ ఫోన్ ఛార్జర్ ద్వారా అమాయక ప్రజలు తమ జీవితాలను కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులలో ఒకరు మొబైల్ ఛార్జింగ్ పెట్టారు. ఛార్జింగ్ పూర్తి అవడమే ప్లగ్ ను ఆపివేయడం మర్చిపోయారు. దాంతో మంటలు ఇల్లంతా వ్యాపించి వారి ప్రాణాలను తీసింది.ఇటీవల కాలంలో చాలామంది ప్రజలకు ఏది అసలు చార్జర్ ...ఏది నకిలీ చార్జర్ వారికి తెలియడం లేదు.అలాగే కొనుగోలు చేసేటప్పుడు తమకు అసలైన ఛార్జర్ ఇవ్వమని దుకాణదారునికి  చెప్పడం అంతకన్నా తెలియదు నకిలీ చార్జర్లకు  తగినంత విద్యుత్ శక్తి ఇన్సులేషన్ పొరలు మరియు వోల్టేజ్-రెగ్యులేటింగ్ సర్క్యూట్లు ఉండవు, దీనితో వినియోగదారులకు తీవ్ర నష్టాలు సంభవిస్తాయని   ఆల్-షాలాన్ చెప్పారు. నకిలీ విద్యుత్ గృహోపకరణాలు మరియు పరికరాలను వినియోగించడం ద్వారా ఏర్పడే   ప్రమాదాల గురించి ప్రజా అవగాహనను పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని  అధికారులకు ఆయన  పిలుపునిచ్చాడు. ఒక నకిలీ ఛార్జర్ యొక్క వైర్ సాధారణంగా వేడి ఎక్కుతుంది.ఆ పై అది కరుగుతుంది. లోపల ఉన్న ఇన్సులేషన్ పదార్థం ప్రమాదంగా మారుతుంది. చార్జర్ వైర్ ని తాకినవారికి  షాక్ కొట్టడం లేదా ఆ ఛార్జర్ నుంచి వెలువడిన మంటలు సోఫాలు,ఫర్నిచర్ మరియు దానితో సంబంధం ఉన్న దుస్తులకు అంటుకొని  ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆల్-షాలాన్ అన్ని రాత్రి సమయమంతా ఛార్జర్ తో ఛార్జింగ్ పెట్టడం సరికాదని అందుకు వ్యతిరేకంగా ఆయన హెచ్చరించాడు, అసలైన ఛార్జర్ లను వినియోగిస్తే వాటికి  సేఫ్ గార్డు లను కల్గి ఉంటాయని ఆ విధమైన రక్షణ కలిగి ఉన్నట్లయితే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువుగా ఉంటాయని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com