టీవీ రిమోట్ కంట్రోల్ కోసం తోబుట్టువుల మధ్య తగాదా... తమ్ముడిపై తీవ్రంగా దాడి
- September 14, 2017
మనామా : తోబుట్టువుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వారిని అభివృద్ధి వైపు నడిపిస్తుంది. కానీ, అందుకు విరుద్ధంగా ఓ కుటుంబంలో మూడు పదుల వయస్సు పైబడిన పెద్దవాళ్ళు చిన్నపిల్లల మాదిరిగా టీవీ రిమోట్ కంట్రోల్ కోసం ఒకరిని ఒకరు ముష్టి ఘాతాలతో మొఖాలు వాచే విధంగా చావబాదుకొన్నారు. దీనితో రెండవ హై క్రిమినల్ (అప్పీల్) కోర్ట్ ఆ కుటుంబంలో చిన్నవాడైన తమ్ముడిపై దౌర్జన్యం చేసి మొఖం పగలకొట్టిన నేరానికి గాను ఇద్దరు తోబుట్టువులకు10 బెహెరిన్ దినార్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. జూన్ 16 వ తేది 2016 లో జరిగిన ఈ సంఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేసిన 32 ఏళ్ల చిన్నవాడైన బాధితుడు తన పెద్ద అన్నయ్య (43) మరియు అక్కయ్య (41)లు కలసి టీవీ రిమోట్ కంట్రోల్ ఉపకరణం దాచేనని అనుమానంతో దారుణంగా కొట్టేరని ముఖ్యంగా మొఖంపై కొట్టారని..అంతేకాక తనని ఒక గదిలో బంధించి..టీవీ రిమోట్ కంట్రోల్ ఎక్కడ దాచేవో చెబితే గాని విడిచిపెట్టమని బెదిరించారని వాపోయాడు. తన అక్క తన సోదరునితో ' వాడిని చావగొట్టి ఇంటికి అవతల పడేయమని ' చెప్పిందని భోరున విలపించాడు. దీంతో పోలీసులు ఆ అన్న ,అక్కలపై కేసులను నమోదు చేసి కోర్టుకి అప్పగించారు.ముద్దాయిలు, సోదరుడు మరియు సోదరిలు 10 బేహారిన్ దినార్ల జరిమానా తీర్పుకి వ్యతిరేకంగా మరో అప్పీల్ దాఖలు చేశారు కానీ కోర్టు దానిని తిరస్కరించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







