దసరాకి తమిళనాట కొత్త పార్టీ- నటుడు కమల్‌హాసన్
- September 15, 2017
రాజకీయాలపై మనసువిప్పి మాట్లాడాడు నటుడు కమల్‌హాసన్. త్వరలో సొంతపార్టీని పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. తాను ఇష్టపడి రాజకీయాల్లోకి రావడంలేదని, ప్రజలు రావాలని బలవంతపెడుతున్నారని, అందువల్లే పార్టీ పెడుతున్నట్టు చెప్పాడు. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను బయటపెట్టాడు. సెప్టెంబర్ చివరినాటి పార్టీ జెండా, విధివిధానాలు ఖరారు కానున్నాయి.
తను మనసు పూర్వకంగా ఈ నిర్ణయం తీసుకోలేదని, తన ఆలోచనలో సరిపోయే రాజకీయ పార్టీలు తమిళనాడులో లేవని, అందుకే కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నానన్నాడు. ఇటు శశికళను అన్నాడీఎంకే నుంచి తప్పించడాన్ని స్వాగతించిన ఆయన, తమిళ రాజకీయాల్లో మార్పు వస్తోందనడానికి ఇదో సాక్ష్యమన్నాడు. అలాగే బీజేపీతో తాను సంబంధం పెట్టుకోనని మరోసారి కుండబద్దలు కొట్టేశాడు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







