మహానుభావుడు ట్రైలర్ రిలీజ్
- September 18, 2017
శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "మహానుభావుడు". ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసుకొన్న మహానుభావుడు సినిమా ఎలా ఉండనున్నదో శాంపిల్ చూపించింది. శర్వానంద్ కు 'ఓసీడీ' అంటే క్వాలిఫికేషన్ కాదు.. అతి శుభ్రం అని చెబుతూ.. అతని అతి శుభ్రంతో మనల్ని ఎలా నవ్విస్తాడో చూపించారు.. కాగా సోమవారం సాయంత్రం మహానుభావుడు ట్రైలర్ రిలీజైంది. తాజాగా ట్రైలర్ లో హీరో ప్రేమలో పడ్డాక పడే కష్టాలు ఏమిటి అన్నది చూపించారు.. హీరోయిన్ మెహ్రీన్ కృష్ణగాడి వీర ప్రేమ గాధలో ఎలా అందంగా కనిపించిందో.. ఈ సినిమాలో కూడా అదే గ్రేస్ ని కలిగి ఉంది.. ఇక శర్వానంద్ ఇప్పటి వరకూ తన సినిమాల్లో కంటే డిఫరెంట్ లుక్ తో స్టైలిస్ లుక్ లో కనిపించాడు.. హీరోయిన్ తండ్రిగా నాజర్ అతని అతి శుభ్రంతో మనం పడలేం అని చెప్పడంతోనే సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండనున్నట్లు అనిపిస్తోంది.. ఇప్పటికే భలే భలే మగాడివోయ్ లో హీరోకి మతి మరుపుతో ప్రేక్షకులను నవ్వించి ఆకట్టుకొన్న మారుతి.. ఈ సారి హీరోకి అతి శుభ్రంతో ఆద్యంతం అలరిస్తుంది అనిపించేలా ట్రైలర్ ఉంది.. ముఖ్యంగా శర్వా తో సెల్ఫీ తీసుకొంటున్న ఆంటీలను.. కొద్దిగా నాలిక లోపల పెట్టండి అని చెప్పడంతో కామెడీతో పాటు.. నేటి యువత సెల్ఫీ అంటే ఏ విధంగా తీసుకొంటుందో సెటైరికల్ గా చూపించిన విధానం మరింత ఆకట్టుకొంటుంది.. మనం దేనినైతే అసహ్యించుకొంటామో.. దేవుడు అందులోనే ముంచి లేపుతాడు వంటి డైలాగ్స్ తో ట్రైలర్ బాగుంది అనిపిస్తుంది. ఈ సినిమాతో శర్వా, మారుతి, మెహ్రీన్ ఖాతాలో మరో హిట్ పడేటట్లు ఉన్నది.. కాగా మహానుభావుడు.. మహేష్ స్పైడర్, ఎన్టీఆర్ జై లవకుశ కు పోటీగా రిలీజ్ కానున్నది సంగతి విధితమే..
తాజా వార్తలు
- ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!
- సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!
- యూఏఈలో భారీగా క్రిస్టల్ మెత్ పట్టివేత..!!
- రిజిస్ట్రేషన్ లేని పెప్టైడ్ల విక్రయంపై సౌదీ కఠిన చర్యలు..!!
- బహ్రెయిన్‌లో ఐదుగురు ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్







