ఆకట్టుకొంటున్న 'రాజా ది గ్రేట్' టైటిల్ సాంగ్
- September 19, 2017
మాస్ మహారాజ రవితేజ చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత చేస్తున్న సినిమా రాజా ది గ్రేట్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, అక్టోబర్ సెకండ్ వీక్ లో రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పటి నుంచే చిత్ర యూనిట్ సాంగ్స్, టీజర్స్ తో సందడి చేయడానికి రెడీ అయ్యింది. చిత్ర యూనిట్ నిన్న రాజా ది గ్రేట్ టైటిల్ సాంగ్ ని రీలీజ్ చేసింది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ తో మంచి రెస్పాన్స్ అందుకొన్న రాజాది గ్రేట్ తాజాగా టైటిల్ సాంగ్ కూడా సూపర్బ్ రెస్పాన్స్ అందుకొంటున్నది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ మెహ్రీన్ నటిస్తోంది. రాజా ది గ్రేట్ మూవీపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఉంది. అందుకు కారణం రవితేజ ఇందులో అంధుడు పాత్రలో నటిస్తున్నాడు. హీరోకి కళ్ళు కనిపించకపోయినా సరే, సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కి మాత్రం లోటు లేదంటున్నారు యూనిట్ సభ్యులు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







