యువతీ మాదిరిగా పలువురికి ఫోన్ కాల్స్ చేస్తూ నమ్మకద్రోహం చేస్తూ పట్టుబదిన పౌరుడు
- September 21, 2017
మస్కట్ : ' హలో... నాకు కొంచెం సహాయం చేయరూ ప్లీజ్ ? అని అర్థిస్తూ ఓ యువతీ మాదిరిగా గొంతు మార్చి మోసం చేస్తున్న ఓ పౌరుడు పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడు ఏదో ఒక నెంబర్ ఎంచుకొని బాధితులతో గోముగా మాట కలుపుతాడును. . ఆ తర్వాత తన ఫోన్ నెంబర్ ఇచ్చి...' నన్ను పెళ్ళి చేసుకొంటావా ? అని మురిపెంగా ముగ్గులోకి దించుతాడు. వారు మురిసి మైమరచిపోయిన తరుణంలో.... అది కొనివ్వవా డియర్ ? ...ఈ గిఫ్ట్ నాకు ఎంతో ఇష్టం డార్లింగ్ అంటూ వారి వద్ద కొసరి కొసరి తనకు కావాల్సినది ముద్దుగా అడిగి మరీ కనిపించకుండా కొనిపించుకొంటాడా ఘరానా మోసగాడు. ఆడవారంటే పొంగిపోయే కొందరు పురుషపుంగవులను ఎన్నుకొని బహుమతుల మీద బహుమతులు సంపాదిస్తున్న వేళ ఒకరోజు పోలీసులు వలపన్ని ఆ మాయ(లో)లేడి ని అదుపులోనికి తీసుకొన్నారు. ధహిరా పోలీస్ కమాండ్ వద్ద విచారణ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఈ తరహా మోసంకు పాల్పడుతున్న ఓ పౌరుడిని అరెస్టు చేశారు. తనతో మాట్లాడుతున్నది ఖచ్చితంగా ఓ అందమైన వివాహం కానీ యువతేనని నిర్ణయించుకొన్న ఓ అమాయకుడు...తనకు కాబోయే భార్య అడిగిందని ఏకంగా తన కారుని ఉన్న పళంగా విక్రయించి ఆ సొమ్ముని 1,900 రాయల్ ఒమాన్ నగదుని మోసగాడి పరం చేసాడు. ఆ తర్వాత తన ఊహాసుందరి తప్పక వివాహం చేసుకొంటుందని భ్రమించాడు. ఇదే తరహాలో పలువురిని మోసం చేస్తున్న నిందితుడిని ఇటీవల పోలీసులు పట్టుకొన్నారు. తానూ చేసిన నేరాలన్నింటిని ఆ మిమిక్రి మోసగాడు అంగీకరించాడు. ఆ వ్యక్తిని మరింతగా ప్రశ్నించడానికి న్యాయవ్యవస్థ ఎదుటకు పంపబడ్డాడు. మోసంతో టెలీకమ్యూనికేషన్స్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ నిందితునిపై పలు అభియోగాలు మోపారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







