కువైట్ గల్ఫ్ సంక్షోభం: కువైట్ మధ్యవర్తిత్వానికి ఖతార్ ప్రశంసలు
- September 21, 2017
న్యూయార్క్: ఖతారీ ఎమిర్ షేక్ తమీమ్ అల్ థని మాట్లాడుతూ, చిత్తశుద్ధితో గల్ఫ్ సంక్షోభం విషయంలో కువైట్ మధ్యవర్తిత్వం వహిస్తుండడం ఆహ్వానించదగ్గ విషయమని చెప్పారు. కువైట్ ఎమిర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారాయాన. గత కొంతకాలంగా గల్ఫ్‌లో నెలకొన్న సంక్షోభానికి సంబంధించి కువైట్ మద్యవర్తిత్వం వహిస్తోంది. ఖతార్ ఓ వైపు, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్ట్ మరో వైపు నిలిచాయి. ఖతార్ తీవ్రవాదానికి మద్దతిస్తోందని మిగిలిన దేశాలు ఆరోపిస్తూ, ఖతార్‌తో సంబంధాలు తెంచుకోవడంతో సంక్షోభం తలెత్తింది. ఖతార్ ఎప్పుడూ తీవ్రవాదానికి మద్దతివ్వడంలేదని ఈ సందర్బంగా షేక్ తమీమ్ స్పష్టం చేశారు. జిసిసి దేశాల ఐక్యత కోసం ఖతార్ కృషి చేస్తుందనీ, సమాచార లోపంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







