త్వరలో కొత్త ఫ్యూచర్ తో వాట్సప్
- September 22, 2017
ఇన్‌స్టంట్ మెసేజింగ్‌లో దూసుకెళుతున్న యాప్
వాట్సప్ లేని స్మార్ట్‌ఫోన్ ఉండదు. ఈ యాప్ ఇన్‌స్టంట్ మెసేజింగ్(సత్వర మెసే జింగ్)తో వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు. మరే ఇతర మెసేజింగ్‌యాప్‌లో లేని విధంగా అప్‌డేట్లను అందిస్తూ నంబర్ వన్ మెసేజింగ్ యాప్ గా గుర్తింపు పొందుతోంది. చాలా మంది వాట్సప్‌ను వినియోగి స్తున్నా అందులోని ఫీచర్లను పట్టించుకోరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వినియో గదా రుల కోసం ఇటీవల లేటెస్ట్ అప్‌డేట్లను ప్రవేశపెట్టింది.
అన్ని డాక్యుమెంట్లు పంపొచ్చు...
మొన్నటి వరకు కేవలం జేపీజీ, పీడీఎఫ్, ఆడియో, వీడియో, లొకేషన్ మాత్రమే షేర్ చేసుకునే అవకాశ ముండేది. వాట్సప్ అప్‌డేట్‌లో కొత్త ఆప్షన్ ప్రవేశపె ట్టారు. ఎలాంటి రకాల ఫైళ్లయినా పంపించు కోవచ్చు. దీనికి తోడు వినియోగదారులు 100 ఎంబీ(మెగా బైట్స్) వరకు సైజు గల డాక్యుమెంట్లను సులభంగా సెండ్ చేసుకోవచ్చు. సెండ్ చేస్తున్న, రిసీవ్ చేస్తున్న పిక్చర్, డాక్యుమెంట్ల క్వాలిటీ తగ్గిపోకుండా వాటిని కంప్రెస్ చేయకుండానే ఒరిజి నల్ పిక్చర్‌లను పంపించడానికి అవకాశం ఉంది.
యూఏఈకి వాట్సప్ కాల్....
వాట్సప్ కాలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టి దాదాపు ఏడాది గడుస్తున్నా మొన్నటి వరకు యూఏఈకీ మాత్రం కాలింగ్ చేసుకునే అవకాశం లేదు. దేశ భద్రతా దృష్ట్యా వాట్సప్ కాలింగ్‌కు అక్కడి ప్రభుత్వం అనుమ తించలేదు. దీంతో దుబాయి, షార్జా, అజ్మాన్ తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు తమ కుటుంబ సభ్యులతో సంభా షించడానికి ఇబ్బందులు పడ్డారు. ఇటీవల దుబా యి అధికారులు వాట్సప్ కాలింగ్ ఫీచర్‌కు అనుమతి ఇవ్వడంతో కొద్ది రోజులుగా విస్తృతంగా వాట్సప్ కాల్స్‌ను వినియోగిస్తున్నారు.
హ్యాకింగ్ నుంచి రక్షణ పొందండిలా...
రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు వాట్సప్‌పైన విరుచుకుపడున్నాయి. వాట్సప్‌లో ఇటీవల వచ్చిన 'టూ స్టెప్ వెరిఫికేషన్' ద్వారా మన మెసేజ్‌లు హ్యాకింగ్ గురి కాకుండా భద్రంగా కాపా డుకోవచ్చు. వాట్సప్ అప్లికేషన్‌ను ఓపెన్ చేశాక పైభాగంలో కుడివైపున ఉన్న మూడు నిలువు చుక్కలను ప్రెస్ చేయాలి. ఇందులో వచ్చే ఆప్షన్‌లలో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అకౌంట్ ఆప్షన్‌ను ఓపెన్ చేయాలి. ఇందులో ఉండే 'టూస్టెప్ వెరిఫికేషన్'ను సెలెక్ట్ చేయాలి. ఆ ఆప్షన్‌ను 'ఎనేబుల్' చేసుకుంటే సరిపోతు ంది. వెంటనే పిన్‌సెట్ చేసుకోమని అడుగుతుండి. స్మార్ట్‌ఫోన్‌లకు ఏ విధమైన లాక్‌లు సెట్‌చేస్తామో అదే మాదిరిగా ఒక ఆరు అంకెల పిన్ సెట్ చేసుకోవాలి. రెండు సార్లు పిన్ ఎంటర్ చేయగానే ఈమెయిట్ ఐడీ వెరిఫికేషన్ కోసం అడుగుతుంది. మన స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఈ మెయిల్ ఐడీని ఎంపిక చేసుకొని వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఇప్పుడు 'టూ స్టెప్ వెరిఫికేషన్' అనేది ఎనేబుల్ అవుతుంది. ఇలా చేసుకోవడం ద్వారా వాట్సప్‌కు వందశాతం సెక్యూరిటీ అందించే అవకాశముంది. ఇంకేం మరి మీరూ ప్రయత్నించండి.
ఆపిల్ యూజర్లకు ప్రత్యేక ఫీచర్లు...
సాధారణ స్మార్ట్‌ఫోన్ వినియోగదా రులకంటే...'ఆపిల్'ఫోన్లను వినియోగించే వినియోగదారులకు వాట్సప్ ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది. 'సిరి' అను ఆప్షన్ ద్వారా మనకు వచ్చిన మెసేజ్‌లను చదివి వినిపిస్తోంది. మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయడం, డిలీట్ చేయాలంటే సాధారణ ఫోన్‌లలో ఒకదాని కన్నా ఎక్కువగా సెలెక్ట్ చేసే అవకాశం లేదు. అదే ఆపిల్ ఫోన్‌లో అయితే ఒకదాని కన్నా ఎక్కువగా ఒకేసారి సెలెక్ట్ చేసే అవకాశం వచ్చింది.
వాట్సప్‌లో వచ్చిన ఇతర మార్పులు ఇవే..
వాట్సప్‌లో ఇంతకు ముందు స్టేటస్ అంటే కేవలం ప్రొఫైల్ మార్చడం, చిన్న వ్యాఖ్య పెట్టడం ఏదైనా పెట్టుకోవచ్చు. లేదా ఇంకో ఏదైనా ఫొటో పెట్టుకో వచ్చు. ఇప్పుడు వచ్చిన అప్‌డేట్‌తో చిన్న చిన్న వీడియోలు సైతం స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.
వాట్సప్ ఓపెన్ చేయగానే హోమ్ స్ర్కీన్ మీదికి స్టేటస్ డిస్‌ప్లే అవుతుంది. ఇంతకు ముందు స్టేటస్ ఆప్షన్ చూడడానికి సెట్టింగ్స్‌లోకి వెళ్లి చూసే వాళ్లము. ఇప్పుడు అలా కాకుండా నేరుగా వాట్సప్ ఓపెన్ చేయగానే స్ర్కీన్‌పైన స్టేటస్ అనేది డిస్‌ప్లే అవుతుంది. దీనికి తోడు ఎవరైనా స్టేటస్ మార్చిన వెంటనే చిన్నపాటి సింబల్‌ను సైతం డిస్‌ప్లే చేస్తుంది.
ప్రైవసీ ఆప్షన్ ఎంచుకోండిలా.. మొదటగా సెట్టింగ్స్‌లోని స్టేటస్ ప్రైవసీ ఆప్షన్ ఎంచుకోవాలి. మొదటిది 'మైకాంటాక్స్' లేదా, రెండోది 'మై కాంటాక్స్ ఆక్సెప్ట్', లేదా మూడోది 'ఓన్లీ షేర్ విత్' అనే మూడు ఆప్షన్లు డిస్‌ప్లే అవుతాయి. మన కాంటాక్టు లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరూ చూ డాలనుకుంటే మొదటి ఆప్షన్, ఒకరు ఇద్దరు తప్ప అనుకుంటే రెండో ఆప్షన్, కేవలం కొంతమంది మా త్రమే అనుకుంటే మూడో ఆప్షన్ సెట్ చేసుకోవాల్సి ఉంది. ఏదీ సెట్ చేసుకోకుంటే డిఫాల్ట్‌గా మొదటిది సెట్.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







