సౌతాఫ్రికాలో జరగబోయే బతుకమ్మ వేడుకలకు తప్పక హాజరుకావాలి
- September 22, 2017
బతుకమ్మ వేడుకలు ఖండాంతరాలకు వ్యాపించాయి. తెలంగాణలోనే కాదు.. విదేశాల్లోనూ పూల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రవాస తెలంగాణవాసులు. సౌతాఫ్రికాలో ఈ నెల 24న బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా ప్రతినిధి సుధీర్ గుండం చెప్పారు. సౌతాఫ్రికాలో జరిగే బతుకమ్మ ఉత్సవాలకు సౌతాఫ్రికాలో ఉండే తెలంగాణ వారందరూ హాజరు కావాలని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత కూడా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సౌతాఫ్రికాలో ఉంటున్న తెలంగాణ బిడ్డలందరికీ ఆమె బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ మీరందరూ బతుకమ్మ పండుగ జరుపుకుంటే ఇక్కడ మాకు కూడా సంతోషంగా ఉంటుందని కవిత పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







