అర్జున్ కపూర్ హీరోగా కపిల్‌దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రం
- September 22, 2017
బాలీవుడ్ లో ఓ ఫిల్మ్ ట్రెండ్ నడుస్తోంది. స్పోర్ట్స్‌లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తుల బయోపిక్ పై దృష్టిసారించారు. అలా తెరకెక్కిన ఫిల్మ్‌లో క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ, సచిన్ టెండుల్కర్ జీవిత చరిత్రలు సిల్వర్ స్ర్ర్కీన్ పై విడుదలై అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ శ్రద్ధాకపూర్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పాత్ర పోషిస్తుంది. ఇక సోనూసూద్ పీ.పీ.సింధూ విజయగాధను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ లిస్టులో మరో క్రికెటర్ చేరిపోయాడు. అతను ఎవరో కాదు ఫస్ట్ టైమ్ ఇండియాకు వరల్డ్ కప్ రూచి చూపించిన వ్యక్తి.
1983లో ఇండియాకు, వెస్టిండీస్‌కు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలి సారి భారత జట్టు వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఆ క్రెడిట్ అంతా ఆల్ రౌండర్ కపిల్ దేవ్‌కే దక్కింది. తన ప్రతిభతో దేశానికి ప్రపంచకప్ అందించిన ఆధ్యుడు. ఈ నేపధ్యంలో డైరెక్టర్ కబీర్ ఖాన్ కపిల్‌దేవ్ జీవిత చరిత్ర పై ఓ సినిమా తెరకెక్కించాలని నిశ్చయించుకున్నాడు. ప్రస్తుతం కాస్టింగ్‌లో బిజీగా ఉన్న కబీర్‌ఖాన్ త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడించనున్నాడు. కాగా కపిల్‌దేవ్ రోల్‌ను యంగ్ హీరో అర్జున్ కపూర్ నటించనున్నాడు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







