పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మూవీ టైటిల్ ..?
- September 22, 2017
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న హాట్రిక్ మూవీపై, ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరుగుతోంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ సంస్థలో రాధాకృష్ణ, దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. పవర్ స్టార్ కి జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ నటిస్తున్నారు. అలాగే ఖుష్బూ, ఇంద్రజ, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుథ్ రవిచంద్రన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.
పవన్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ హాట్రిక్ మూవీకి టైటిల్ అంటూ రెండు మూడు టైటిల్స్ హల్ చల్ చేస్తున్నాయి. వాటిల్లో అజ్ఞాతవాసి, అమ్మ కోసం అభిజిత్, బహుదూరపు బాటసారి అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇంకా చిత్ర యూనిట్ వీటిల్లో ఏ టైటిల్ ని ఫైనల్ చేయలేదు. కానీ వీటిల్లో అజ్ఞాతవాసి పేరు పైనే చిత్ర యూనిట్ మెగ్గు చూపుతోందట. పవన్, త్రివిక్రమ్ కాంబోలో జల్సా హిట్ అయ్యింది. అత్తారింటికి దారేది ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీంతో ఇప్పుడొస్తున్న హాట్రిక్ మూవీపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







