చామకూర పకోడీ

- September 24, 2017 , by Maagulf
చామకూర పకోడీ

కావలసిన పదార్థాలు: చామకూర- 10 వెడల్పాటి ఆకులు, సెనగపిండి- 1 కప్పు, ఉప్పు- తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- 1 చెంచా, కారం- 1 చెంచా, పసుపు- చిటికెడు, గరం మసాలా- చిటికెడు, సన్నగా తరిగిన కొత్తిమీర- కొంచెం, నూనె- సరిపడినంత
తయారీ విధానం: చామకూర ఆకులను కడిగి తుడిచి పెట్టుకోవాలి. సెనగపిండిలో మిగతా వస్తువులు, కొద్దిగా నీరు కలిపి చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. చామకూర ఆకుపై ఈ ముద్దను పలుచగా రాసి చాప చుట్టలా మడిచి ఉంచాలి. అదే విధంగా అన్ని ఆకులతో చేసుకోవాలి. ఈ మడతలను ఆవిరి మీద పదిహేను నిమిషాలు ఉడికించాలి. అవి చల్లారిన తర్వాత అంగుళం వెడల్పుతో ముక్కలుగా కట్‌ చేసుకుని నూనెలో ఎర్రగా కరకరలాడేలా వేయించుకోవాలి. వీటిని ఉల్లిచక్రాలతో నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com