అమెరికాలోని న్యూజెర్సీలో బతుకమ్మ సంబరాలు
- September 25, 2017
అమెరికాలోని న్యూజెర్సీలో బతుకమ్మ సంబరాలు అంగరంగవైభవంగా జరిగాయి. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జరిగిన బతుకమ్మ వేడుకలకు వందలాది మంది తరలివచ్చారు. తెలంగాణ అడపడుచులంతా బతుకమ్మలతో ఒక్కచోట చేరి ఆటాపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ చైర్మన్ పైల్ల మల్లారెడ్డి, అమెరికా తెలుగు అసోసియేషన్ చైర్మన్ హన్మంతరెడ్డి, అమెరికా తెలంగాణ అసోసియేషన్ చైర్మన్ కరుణాకర్ మాధవరం, టీవీ5 యూఎస్ఏ సీఈవో శ్రీధర్ చిల్లర, టాటా బోర్డ్ అడ్వైజర్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బతుకమ్మలను అందంగా అలరించిన వారికి, వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







