హైదరాబాద్ పాతబస్తీలో తనిఖీలు.. అరబ్‌షేక్‌లు, బ్రోకర్ల అరెస్ట్
- September 25, 2017
అంతర్జాతీయ కాంట్రాక్ట్ మ్యారేజ్ అడ్డాలపై సౌత్ జోన్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. నగరంలోని పాతబస్తీ, ఫలక్‌నుమ, చంద్రాయణగుట్ట, తలాబ్‌కట్టా ప్రాంతాల్లోని ఖాజీల ఇళ్లు, కార్యాలయాలపై పోలీసులు ఏకకాలంలో తనిఖీలు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఖాజీ అలీ అబ్దుల్లా రఫైతో పాటు పలువురు అరబ్‌షేక్‌లు, బ్రోకర్లు ఉన్నారని డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. రఫైపై పీడీ యాక్ట్ ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.
అమాయకులైన యువతులను, బాలికలను అరబ్‌షేక్‌లకు ఇచ్చి బలవంతంగా వివాహాలు చేయడం, విదేశాలకు తీసుకెళ్లి వారికి నరకం చూపిస్తుంటారన్న విషయం తెలిసిందే. బ్రోకర్ల సాయంతో యువతుల కుటుంబాలకు డబ్బు ఆశచూపి పెళ్లిచేసుకుని విదేశాలకు తీసుకెళ్తారు అరబ్‌షేక్‌లు. ఇటీవల నమోదైన కొన్ని కేసులతో ఈ అంతర్జాతీయ మ్యారేజ్ కాంట్రాక్ట్ అడ్డాలపై పోలీసులు దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే నిఘా ఉంచిన కొన్ని మ్యారేజ్ అడ్డాలపై దాడులు నిర్వహించి పలువురు అరబ్‌షేక్‌లు, బ్రోకర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







