అవార్డ్స్ నా లక్ష్యం కాదు అంటున్న రాజమౌళి

- September 26, 2017 , by Maagulf
అవార్డ్స్ నా లక్ష్యం కాదు అంటున్న రాజమౌళి

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి.. భారతీయ సినిమాకు సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసిన సినిమా బాహుబలి2. ఓ ప్రాంతీయ భాషా చలన చిత్రం ఎవరూ ఊహించని విధంగా దేశ వ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకొన్నది. ఈ బాహుబలి 2 చిత్రం 2018 ఆస్కార్ నామినేషన్ల కోసం ఇండియా నుంచి వివిధ భాషల నుంచి పోటీపడ్డ సినిమాల్లో ఒకటి.. మొత్తం భారత్ లోని వివిధ బాషల నుంచి మొత్తం 26 సినిమాలు పోటీ పడగా... తెలుగు నుంచి గౌతమీపుత్ర శాతకర్ణి కూడా ఉన్నది. కాగా ఈ సినిమాల్లో ఇండియా తరపున ఆస్కార్ రేస్ లో నిలబడే సినిమాగా ఇండియా జ్యూరీ హిందీ 'న్యూటన్' సినిమాను ఎంపిక చేసింది. ఈ నేపద్యంలో బాహుబలి సినిమా ఆస్కార్ కు ఎంపిక కాకపోవడం పై రాజమౌళిని ఓ ఆంగ్ల పత్రిక ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానంగా తాను బాహుబలి 2 కు ఆస్కార్ నామినేషన్ దక్కనందుకు ఏ మాత్రం బాధపడడం లేదని ... ఆ సినిమాను తెరకెక్కించే సమయంలో తాను అవార్డ్స్ గురించి ఆలోచించలేదని.. అసలు అవార్డ్ అనేది నా లక్ష్యం కాదని తెలిపారు. సినిమాకు అవార్డ్స్ వస్తే చాలా సంతోషమే.. కానీ రాకపోయినా నేను దాని గురించి ఆలోచించను... నేను సినిమా ప్రాజెక్టును నమ్మి తమ జీవితాలను పెట్టుబడిగా పెట్టిన వారి కోసం బాగా వసూళ్లు సాధించేలా ప్రేక్షకుల దగ్గరకు తీసుకొని వెల్లడమే నా లక్ష్యం.. సినిమా హిట్ అయ్యి కలెక్షన్లు సాధిస్తే చాలా ఆనందం అని బాహుబలి 2 సినిమాను చెక్కిన జక్కన్న రాజమౌళి చెప్పారు.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com