రష్యాలో 2018లో ఫేస్‌బుక్‌ను నిషేధిస్తాం!
- September 26, 2017
రష్యా
తమ చట్టాలను అతిక్రమిస్తే 2018లో తమ దేశంలో ఫేస్‌బుక్‌ను నిషేధిస్తామని రష్యాకు చెందిన టెలికాం సంస్థ అధిపతి అలెగ్జాండర్ ఝరోవ్ హెచ్చరించారు. 'ఫేస్‌బుక్ మా చట్టాలను అనుసరించేలా పనిచేస్తాం. 2018లో కచ్చితంగా ఇది జరుగుతుంది' అని ఆయన మాస్కోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
విదేశీ మెసేజింగ్ సర్వీసులు, సెర్చ్ ఇంజన్లు, సామాజిక మాధ్యమాల వెబ్‌సైట్లు రష్యన్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి కావాల్సిన విధివిధానాలను పేర్కొంటూ 2014లో ప్రత్యేక చట్టాన్ని రూపొందించారు. దీని ప్రకారం ఆ దేశస్థుల అన్ని విషయాలను రష్యాలోని సర్వర్లలోనే నిక్షిప్తం చేయాలి. ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాద్యమాలు వినియోగదారుల సమాచారాన్ని వారి ప్రమేయం లేకుండానే తీసుకుంటున్నారని ఈ సర్వీసులను అక్కడి టెలికం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఫేస్‌బుక్ తగిన నివారణ చర్యలు తీసుకోకుంటే లింక్డ్‌ఇన్ మాదిరిగానే రష్యాలో నిషేధిస్తామని ఝారోవ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







