విక్రమ్, సమంత నటించిన `10` ఫస్ట్‌లుక్ విడుదల
- September 26, 2017
శివపుత్రుడు, అపరిచితుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సెన్సేషనల్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా బ్యూటీఫుల్ సమంత హీరోయిన్గా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ `10 ఎన్నత్తు కుల్ల`. ఎ.ఆర్.మురుగదాస్ నిర్మించిన ఈ చిత్రం తమిళంలో పెద్ద హిట్ మూవీగా నిలిచింది. ఫాక్స్‌స్టార్, ఎ.ఆర్.మురుగదాస్ సమర్పణలో శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై జి.సుబ్రమణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావ్ చింతపల్లి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. విజయ్ మిల్టన్ దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. అనువాద కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసి సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్, ఆడియో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







