కపిల్దేవ్ బయోపిక్ '83'
- September 27, 2017
భారత్కు తొలి వరల్డ్కప్ అందించిన కపిల్దేవ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ '83'. ఈ సినిమాలో బాలీవుడ్ కథానాయకుడు రణ్వీర్ సింగ్ కపిల్గా నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమాన్ని ముంబైలో ఏర్పాటు చేశారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు ‘83’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ కార్యాక్రమానికి 1983 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు సభ్యులు కపిల్ దేవ్, రోజర్ బిన్ని, మదన్ లాల్, కీర్తి ఆజాద్, బల్వీందర్ సింగ్ సంధు, శ్రీకాంత్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగసర్కార్, యశ్ పాల్, సునిల్ వాల్సన్లు హాజరై సందడి చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. కపిల్ పాత్రలో రణ్వీర్ నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పాత్రకు అతడే సరైనవాడని తెలిపారు. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు తాను 1983 వరల్డ్కప్ టీవీలో చూశాను. అప్పటి విజయం భారత క్రికెట్లో ఇంతటి మార్పును తెస్తుందని ఊహించలేదన్నారు. గొప్ప ఆటగాడి జీవిత చరిత్రను తెరకెక్కించడం ఆనందంగా ఉందని కబీర్ ఖాన్ పేర్కొన్నారు. నాటి ప్రపంచ కప్లో పాల్గొన్న క్రికెటర్ల ఫొటోలతో కూడిన బ్యాట్లు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







