బీబీసీ జాబితాలో మిథాలీకి చోటు!
- September 27, 2017
భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్‌కు అరుదైన గౌరవం లభించింది. భారత్‌లో అత్యంత ప్రభావశీల మహిళగా మిథాలీని బీబీసీ గుర్తించింది. ఈ ఏడాది భారత్‌లోని ప్రభావవంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆమెకు చోటు దక్కింది. ప్రపంచ మహిళా క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మిథాలీ రికార్డు నమోదు చేసిన విషయం విదితమే.
మిథాలీతో పాటు ఢిల్లీకి చెందిన రచయిత, యోగ టీచర్, సామాజిక కార్యకర్త ఇరా త్రివేది, జర్నలిస్ట్ తులికా కిరణ్, బెంగుళూర్‌కు చెందిన ఎంబైడ్ వ్యవస్ధాపక సీఈవో అదితి అవస్థి, నటుడు నవాజుద్దీన సిద్దిఖీ తల్లి మెహరున్నిసా సిద్ధిఖిలు ఈ జాబితాలో ఉన్నారు. ఆధునిక జీవితంలోని అన్ని రంగాల్లో వీరు తమదైన ముద్రతో దూసుకుపోతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







