ఆలు క్యారెట్లతో మిక్సెడ్ కూర
- September 28, 2017
కావలసిన పదార్థాలు: సొరకాయ - ఒకటి, బంగాళ దుంపలు - రెండు, టమాటాలు - రెండు, క్యారెట్లు - రెండు, పెరుగు - ఒక కప్పు, పచ్చిమిరపకాయలు - మూడు, ఉల్లిపాయలు - రెండు, కారం - ఒక టీ స్పూను, పసుపు - చిటికెడు, ధనియాల పొడి - ఒక టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర- అర టీ స్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత, నూనె సరిపడా.
తయారుచేయు విధానం: కాయగూరలన్నీ శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కోసుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి నూనె పోసి బాగా కాగాక ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి వేగించాలి. తరువాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేగించాలి. తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి కూరగాయ ముక్కలు కూడా వేసి వేగించాలి. కొద్దిగా నీళ్లు, పెరుగు పోసి ముక్కలు మెత్తపడే వరకూ ఉడికించాలి. చివర్లో కొత్తిమీర తురుము వేసి దించేయాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







