మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? బచ్చలికూర, చికెన్ తినండి

- September 28, 2017 , by Maagulf
మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? బచ్చలికూర, చికెన్ తినండి

మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? అయితే బచ్చలికూర తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆస్టియో ఆర్థ్రయిటిస్‌ సమస్య చాలామందిని వేధిస్తోంది.  2025 నాటికి ఒక్క మనదేశంలోనే ఈ వ్యాధి బాధితుల సంఖ్య ఆరుకోట్లకు చేరుతుందని అంచనా. ఈ వ్యాధి మందులకు తగ్గకపోవడం.. పెయిన్ కిల్లర్స్‌కే పరిమితం కావడమే ఇందుకు కారణం. నొప్పి తగ్గాలంటే..? పెయిన్‌కిల్లర్లు వాడక తప్పడంలేదు. అవి దీర్ఘకాలికంగా వాడితే కాలేయం మీద ప్రభావం పడుతుంది. అందుకే ప్రత్యామ్నాయం మీద దృష్టి సారించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 ఇందులో భాగంగా వారానికి ఓసారి బచ్చలికూర తినాలని వారు సలహా ఇస్తున్నారు. ఇందులోని ఐరన్.. మోకాలి నొప్పులను దూరం చేస్తుంది. మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే.. ఈ రోగాన్ని దూరం చేసే శక్తి బచ్చలి కూరలో ఎక్కువగా వుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 బచ్చలి కూరతో పాటు చికెన్‌కు వారానికి ఓసారి మితంగా తీసుకోవడం ద్వారా మోకాలి నొప్పుల్ని దూరం చేసుకోవచ్చు. ఇంకా మొక్కజొన్నలు, సన్ ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్ వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి శరీర బరువును తగ్గిస్తాయి. తద్వారా మోకాళ్ల నొప్పులను నయం చేస్తాయి. తాజా పండ్లు, కూరగాయలను తీసుకుంటూ ఫాస్ట్ ఫుడ్‌ను పక్కనబెడితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com