అల్లు అర్జున్ సినిమాలో గెస్ట్ రోల్ చేయనున్న చరణ్
- October 01, 2017
మెగా హీరోల మల్టీస్టారర్ సినిమా పై అందరికీ ఆసక్తే... ఎప్పటి నుంచో అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలని మెగా అభిమానుల కోరిక.. ఆ కోరిక ఎప్పటికి తీరుతుందో తెలియదు కానీ.. త్వరలో బన్నీ, చెర్రీ లు కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్.. అవును అల్లు అర్జున్ తాజా సినిమాలో రామ్ చరణ్ అతిధి పాత్రలో నటించనున్నారట. బన్నీ ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నటిస్తున్న "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా" . ఈ సినిమాలో చరణ్ అతిధిగా కనిపించనున్నారట.. 2014 లో రామ్ చరణ్ ఎవడు సినిమాలో బన్నీ అతిధిగా నటించగా ఆ సినిమా ఎంతటి హిట్ సాధించిందో తెలిసిందే... మరో సారి ఈ బావ బావమరుదుల జంట వెండి తెరపై మెగా అభిమానులకు కనువిందు చేయనున్నదట.. అర్జున్ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్న ఈ సినిమా 2018 ఏప్రిల్ లో వేసవి వినోదంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







