వలస కుటుంబాన్ని ఆదుకున్న అజ్మన్ పోలీస్
- October 05, 2017
అజ్మన్ పోలీసులు 38 ఏళ్ళ మహిళ, 71 ఏళ్ళ వయసుగల ఆమె తల్లి, అలాగే 9 ఏళ్ళ వయసుగల కుమార్తెలను ఒక్కటి చేసి, వారిని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేశారు. చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ దుబాయ్‌తో కలిసి అజ్మన్ పోలీసులు ఈ కార్యక్రమం చేపట్టారు. చెక్ బౌన్స్ కేసులో 38 ఏళ్ళ మహిళ చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తుండడంతో వృద్ధురాలు, అలాగే చిన్నారిని వారు నివాసం ఉంటోన్న ఇంటి ఉంచి యజమాని తరిమేశారు. దాంతో ఈ కేసుని పరిశీలించిన అజ్మన్ పోలీస్ - కమ్యూనిటీ సపోర్ట్ సెంటర్ డైరెక్టర్ కెప్టెన్ వాఫా అల్ హోసాని, తొమ్మిదేళ్ళ చిన్నారిని, ఆమె తల్లి అలాగే గ్రాండ్ మదర్‌తో కలపగలిగారు. అనంతరం వారికి స్వదేశానికి వెళ్ళేందుకు టిక్కెట్లను కూడా ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబం ఉజ్బెక్‌కి చెందినవారు. గ్రాండ్ మదర్ లుడా మిలా, పోలీసులు తమ పట్ల దయాపూర్వకంగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







