మా నాగచైతన్య పెళ్లికొడుకాయెనే..!!
- October 05, 2017
సమంత, నాగచైతన్య లు ప్రేమ బంధం ఈ రోజు వివాహబంధంగా మారనున్నది. గోవా లోని డబ్ల్యూ హోటల్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నది.. చైతన్య, సమంతలు ఈ రోజు రాత్రి 11.52.ని లకు వేద మంత్రాల సాక్షిగా ఒక్కటికానున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్య ని పెళ్లి కొడుకు చేసిన ఫోటో ఒకటి నాగార్జున పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో నాగచైతన్య తో తండ్రి.. నాగార్జున తో పాటు.. తన మేనమామ వెంకటేష్ లు ఉన్నారు. ఈ ఫోటోతో పాటు.. నాగార్జున మా అబ్బాయి పెళ్లి కొడుకు అంటూ కామెంట్ ని కూడా జత చేశారు.. గోవాలో జరిగే వీరి వివాహానికి అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులతో పాటు.. సమంత కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్లు.. నాగ్ ఇప్పటికే తెలియజేశారు.. రాత్రి హిందూ సాంప్రదాయంలో జరిగే వీరి వివాహానికి ముందుగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి పెళ్లి వేడుకల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. వివాహం అనంతరం... హైదరాబాద్ లో రిసెప్షన్ జరగనున్నది..
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







