బెంగళూరులో కుండపోత వర్షం
- October 05, 2017
బెంగళూరు మళ్లీ మునిగింది. రాత్రి కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. అర్ధరాత్రి కావడంతో ఏం చేయాలో తెలీక భయాందోళనకు గురయ్యారు. చాలాచోట్ల జాగారం చేయాల్సి వచ్చింది. ఇంట్లో వస్తువులన్నీ తడిసిపోయాయి. ఇంట్లోకి వచ్చిన నీటిని బయటకు తోడినా.. బయట కూడా వర్షపునీరే ఉండడంతో అవి ఎటూ పోలేదు. దీంతో.. కష్టాలు రెట్టింపయ్యాయి.
బెంగళూరులో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో.. కార్పొరేషన్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల్ని ఖాళీ చేయించే పనిలో పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈమధ్యే కురిసిన వర్షంతో బెంగళూరులోని చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వానలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







