హ్యాపీ బర్త్ డే టు హీట్రిక్ డైరెక్టర్ సుధీర్ వర్మ
- October 06, 2017
ఫస్ట్ మూవీతోనే బెస్ట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కుర్రాడు సుధీర్ వర్మ బర్త్ డే ఇవాళ. స్వామిరారా అంటూ డిఫరెంట్ టేకింగ్‌తో అదరగొట్టాడు. ఈ మూవీతో హీరో నిఖిల్‌కు కొత్త టర్న్ ఇచ్చాడు. స్వామిరారాలో సుధీర్ వర్మ దర్శకత్వ ప్రతిభకు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఫిదా అయిపోయారు. చాలామంది బడా హీరోలు అతనితో సినిమా చేయాలని ముందుకొచ్చారు. అలా అక్కినేని క్యాంప్‌లో ఎంటర్ అయిన సుధీర్.. నాగచైతన్యతో దోచెయ్ తీశాడు. ఇది ఆశించని విజయం సాధించకున్నా.. తర్వాత మళ్లీ నిఖిల్‌తో చేసిన కేశవ సూపర్ హిట్ అయింది. కేవశ మరోసారి అతని డైరెక్షన్ కెపాసిటీని చూపించింది.
యంగ్ డైరెక్టర్స్‌లో టాలెంటెడ్ గయ్‌గా పేరు తెచ్చుకున్న సుధీర్ వర్మ ప్రస్తుతం శర్వానంద్‌తో సినిమాకు సిద్ధమవుతున్నాడు. చేసిన మూడు సినిమాలతోనే తనకంటూ స్సెషల్ రికగ్నిషన్ ఫిల్ చేసుకున్న సుధీర్ వర్మ రొటీన్, రెగ్యులర్ టైప్ మూవీస్‌కు వ్యతిరేకం. మరోవైపు ఇండస్ట్రీలో తన ఫ్రెండ్స్ నిఖిల్, చందు మొండేటిలతోనూ అతనిది విడదీయరాని బంధం. ఆ బంధం కారణంగానే ప్రస్తుతం నిఖిల్ హీరోగా రీమేక్ అవుతోన్న కన్నడ బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీ తెలుగు వెర్షన్‌కు ఈ ఇద్దరూ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కొత్తతరం దర్శకుల్లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న సుధీర్ వర్మకు హ్యాపీ బర్త్ డే చెప్పేద్దాం.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







