కెనడాకు చెందిన మోడల్ కంటిలో టాటూ వేయించుకొని చూపు పోగొట్టుకుంది

- October 06, 2017 , by Maagulf
కెనడాకు చెందిన మోడల్ కంటిలో టాటూ వేయించుకొని చూపు పోగొట్టుకుంది

తమ బాడీని అందంగా తీర్చదిద్దడానికి నేటి యువత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. టాటూ పేరుతో ఒళ్లంతా టాటాలు వేయించుకోవడం ...ఢిఫారెంట్ డిజైన్స్ ...వెరైటీ కలర్స్ తో బాడీలో ఉన్న చేతులు, కాళ్లు, వీపు, గొంతు, ఎద..బుగ్గలు తేడలేకుండా టాటూలు వేయించుకొని ముచ్చటపడుతున్నారు.  
కెనడాకు చెందిన మోడల్  గాలింగర్ కూడా టాటూల పై  మోజు పడింది. అందరిలా కాకుండా ఢిఫారెంట్ గా ట్రై చేద్దాం అనుకుంది.  అందరు ఒంటి మీద దృష్టి పెడితే గాలింగర్ మాత్రం కంటి మీద ఫోకస్ పెట్టింది. కంటిల్లో  వైలెట్ కలర్ తో టాటూ వేయించుకోవాలని డిసైడ్ అయింది. అలస్యం చేయకుండా టాటూ డిజైనర్ దగ్గరకు వెళ్లి కుడి కంటి  తెల్లగుడ్డు పై ఐబాల్ పేరిట టాటూ వేయించుకుంది. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలైయ్యాయి. ఫస్టు కంటిలో నుంచి వైలెట్ కలర్ లో టియర్స్ మంటతో వచ్చాయి. కన్ను భాగం అంతా వాచిపోయింది. భయపడి డాక్టర్ దగ్గరకు వెళ్తే చూపుకు కారణమైన కార్నియా దెబ్బతిందని తెలిపారు. సర్జరీ చేస్తే మెరుగు అవచ్చు అనే సలహా మేరకు సర్జరీకి సిద్ధమైంది. యువతకి ఉత్సహం ఉండవచ్చు కానీ అత్యుత్సాహం ఉండకూడదు. అత్యుత్సాహం ఉన్నా బాడీలోని సెన్సిటివ్ పార్ట్స్ పై ప్రయోగం చేయొద్దు అని గాలింగర్ తన ఫోటోస్ ను  సోషల్ మీడియాలో  పోస్టు చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com