డ్రగ్స్ కేసు: మాజీ హీరోయిన్ మమతా కులకర్ణిపై రెడ్ కార్నర్ నోటీసు!?
- October 09, 2017
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ మాజీ హీరోయిన్ మమతా కులకర్ణిపై రెడ్‌కార్నర్ నోటీసు జారీకి రంగం సిద్ధమైంది. దేశంలో ఇప్పటివరకు వెలుగు చూసిన అతి పెద్ద డ్రగ్స్ కుంభకోణం షోలాపూర్‌లో ఎఫిడ్రీన్ పట్టివేతే.
2014లో వెలుగుచూసిన సోలాపూర్ ఎఫిడ్రీన్ పట్టివేత కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.2 వేల కోట్ల పైమాటే. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు నైజీరియన్లు సహా 14 మందిని అరెస్టు చేశారు.
కీలక నిందితులైన మమత, గోస్వామిలు సహా నలుగురి కోసం వేట కొనసాగుతోంది. గతంలో డ్రగ్స్ సంబంధిత కేసులోనే కెన్యాలో మమతా కులర్ణిని అరెస్టయి, విడుదలయ్యారు.
తన సహచరుడు వికీ గోస్వామితో కలిసి మమతా కులకర్ణి పలుదేశాల్లో డ్రగ్స్ దందా నిర్వహించేవారు.
మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఏవన్ లైఫ్‌సైన్సెస్ ఫ్యాక్టరీలో ఎఫిడ్రీన్ తయారీ ముఠాతో వారికి నేరుగా సంబంధాలున్నాయని సీఐడీ పక్కా ఆధారాలు సేకరించింది. తాను సంపాదించిన ఆ ఆధారాలను.. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి సమర్పించింది.
వాటిని అంతర్జాతీయ సంస్థ ఇంటర్‌పోల్‌కు పంపిన సీబీఐ.. మమతపై రెండ్ కార్నర్ నోటీసు జారీచేయాలని కోరింది. రెండు నెలల కిందటే ఈ తతంగమంతా జరిగినప్పటికీ, చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో ఈ ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడ్డాయి.
ఎఫిడ్రీన్ తయారీ కేసుకు సంబంధించి మహారాష్ట్ర సీఐడీ పోలీసులు కొద్దిరోజుల కిందటే(సెప్టెంబర్ 29న) చార్జిషీట్ దాఖలు చేసి, సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌కు పంపారు. 'నేడో, రేపో మమతా కులకర్ణిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది' అని ముంబై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
మమత ప్రస్తుతం కెన్యాలో ఉన్నారు. రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయిన వారిని ఎయిర్‌పోర్టుల్లో సులువుగా చిక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇక మమత సహచరుడు వికీ గోస్వామి అమెరికాలో అండర్ గ్రౌండ్‌లో తలదాచుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







